హీరోయిన్ మాస్క్ పెట్టుకోవడం వెనుక కారణం ఇదే

బాలీవుడ్ బ్యూటీ పరిణితీ చోప్రా ప్రస్తుతం వైఆర్ఎఫ్ వెంచర్ మేరీ ప్యారీ బిందు అనే చిత్రం చేస్తోంది. ఈ చిత్రంలో ఆయుష్మాన్ ఖురానా కథానాయకుడిగా నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రం సెట్స్ పైన ఉండగా, లొకేషన్ లోని ఓ పిక్ ని షేర్ చేసి అందరికి షాకిచ్చింది పరిణితీ. మాస్క్ పెట్టుకొని ఉన్న తన ఫోటోకి క్యాప్షన్ గా సెట్ లో ఫుల్ డస్ట్ ఉంది. క్రూ మొత్తం మాస్క్స్ ధరించారు. మరి ఇంత అందంగా ఉంది మా ప్రొడక్షన్ అని కామెంట్ పెట్టింది. అంటే క్రూ అంత తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మాస్క్ లు ధరించారు అని అర్ధం వచ్చేలా ఈ కామెంట్ ఉంది. కాని ఫోటోని చూస్తే మాత్రం మరోలా ఉంది. పరిణితీ చోప్రా ఒక్కతే మాస్క్ ధరించగా, మిగతా వాళ్లందరు ఆమె వెనుక ఉన్న స్థలాన్ని మాస్క్ లేకుండానే క్లీన్ చేస్తున్నట్టు కనిపిస్తోంది. మరి పరిణితీ కామెంట్ వెనుక ఉన్న అర్దం ఏంటో తెలియక ఫ్యాన్స్ కాస్త కన్ఫ్యూజన్ లో ఉన్నారు. పరిణితీ చోప్రా నటిస్తోన్న మేరీ ప్యారీ బిందు చిత్రానికి అక్షయ్ రాయ్ దర్శకత్వం వహిస్తోండగా, ఈ చిత్రాన్ని మే 12,2017న థియేటర్స్ లోకి తీసుకురావాలని భావిస్తున్నారు..
× RELATED ఆధార్ కార్డ్ ఉంటే చాలు నేపాల్, భూటాన్ వెళ్లొచ్చు!