ఈ కుర్ర హీరో దసరాకి ఫిక్స్ అయ్యాడట..!

నేను శైలజ చిత్రంతో క్రేజీ కాంబోగా పేరు తెచ్చుకున్న‌ రామ్- కిషోర్ తిరుమల ప్రస్తుతం ఉన్నది ఒక్కటే జిందగీ అనే ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. రామ్ 15వ మూవీగా ఈ చిత్రం రూపొందుతుండగా, రీసెంట్‌గా టీం అంతా ఊటీలో చిత్రీకరణ పూర్తి చేసిన‌ట్టు తెలుస్తుంది. ఇక‌ ఓ సాంగ్ మాత్రం బ్యాలెన్స్ ఉంద‌ని టాక్. ఈ సాంగ్ ని ఫారెన్ లో చిత్రీకరించనున్నామని నిర్మాత స్రవంతి రవి కిషోర్ ఇటీవ‌ల‌ తెలియజేశారు. స్నేహం, ప్రేమ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో రామ్ అభిరామ్ అనే పాత్రలో కనిపించనున్నాడు. ఇటీవల ఈ పాత్ర లుక్ ని కూడా పరిచయం చేశాడు. ఇక ఈ చిత్రంలో కథానాయికలుగా అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్, లావ‌ణ్య త్రిపాఠి నటిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన పాటలను త్వరలోనే విడుదల చేయనుండగా, మూవీని దసరా కానుకగా సెప్టెంబర్ 30న విడుదల చేయనున్నట్టు తెలుస్తుంది. మొత్తానికి హైపర్ చిత్రం తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న రామ్ దసరాకి తన ఫ్యాన్స్ కి మంచి గిఫ్ట్ నే అందించనున్నాడన్నమాట.
× RELATED పైళ్ల శేఖర్ రెడ్డిని ఆశీర్వదించి గెలిపించాలి: సీఎం కేసీఆర్