ఓటు విలువతో..

మంచు విష్ణు, సురభి జంటగా నటిస్తున్న చిత్రం ఓటర్. రామా రీల్స్ పతాకంపై జాన్ సుధీర్ పూదోట నిర్మిస్తున్నారు. జి.ఎస్ కార్తీక్ దర్శకుడు. ఈ నెల 21న ఈ చిత్రం విడుదలకానుంది. నిర్మాతగా, పంపిణీదారుడిగా ఎన్నో విజయవంతమైన సినిమాలను తెలుగు ప్రేక్షకులకు అందించిన ప్రశాంత్ గౌడ్ సార్ధక్ మూవీస్ పతాకంపై ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదలచేస్తున్నారు. ఈ సందర్భంగా ప్రశాంత్‌గౌడ్ మాట్లాడుతూ ఓటు హక్కును, ఓటర్ విలువను చాటిచెప్పే చిత్రమిది. పదవిలో ఉన్న నాయకుడు సరిగా పనిచేయకపోతే అతడితో ఎలా పనులు చేయించుకోవాలో చెబుతుంది. రాజకీయ అంశాలకు నాటకీయతను జోడించి దర్శకుడు కార్తిక్ ఆసక్తికరంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. కథ నచ్చి ఫ్యాన్సీ రేటుకు ఈ చిత్ర విడుదల హక్కులను సొంతం చేసుకున్నాం. తెలుగు ప్రేక్షకుల్ని అలరిస్తుందనే నమ్మకం ఉంది అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: తమన్, కెమెరా: రాజేష్ యాదవ్, ఎడిటింగ్: కె.ఎల్ ప్రవీణ్.

Related Stories: