ఓట్ ఫర్ టీఆర్ఎస్.. సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సమితి గెలుపునకు ప్రజలే స్వచ్ఛందంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎవరికి నచ్చిన రీతిలో వారు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు, ఇతర పార్టీల నాయకులకు టీఆర్‌ఎస్ నేతలకు వ్యత్యాసం, నాయకత్వ లక్షణాలు, మంచితనం, అభివృద్ధిపై టీఆర్‌ఎస్ నాయకులకున్న అంకిత భావం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అప్పటి పార్టీలు, ప్రభుత్వాలు వ్యవహరించిన తీరు, అభివృద్ధిని పట్టించుకోని వైనం, తెలంగాణ ప్రభుత్వం వచ్చాక ప్రభుత్వ ఉద్యోగులకు పెరిగిన జీతాలు వంటి అంశాలను వివరిస్తూ, విశ్లేషిస్తూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నది. ఓట్ ఫర్ టీఆర్‌ఎస్ పేరుతో వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసి ఎవ్వరికి నచ్చిన రీతిలో వారు ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్, టీడీపీ పాలనలో జరిగిన అన్యాయం, అక్రమాలు, తెలంగాణపై చూపిన వివక్ష వంటి వాటిని ఓట్ ఫర్ టీఆర్‌ఎస్ పేరుతో ఏర్పాటు చేసిన గ్రూపుల్లో పోస్ట్ చేస్తున్నారు. టీఆర్‌ఎస్‌ను గెలుపించుకుంటే కలిగే ప్రయోజనాలు, బంగారు తెలంగాణ నిర్మాణం, ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వం, ఉద్యమ సమయంలో కాంగ్రెస్‌పార్టీ, తెలుగుదేశం చేసిన మోసాలు, ఉద్యమ సమయంలో ముఖ్యంగా కాంగ్రెస్‌పార్టీ నాయకులు పదవులు పట్టుకొని వేలాడిన తీరు, గత ప్రభుత్వాల్లో కరెంటు కోతలు, ప్రస్తుతం 24 గంటల విద్యుత్ ఇస్తున్న తీరు, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, పెన్షన్లు, రైతుబంధులో భాగంగా ఎకరానికి రూ.4 వేలు, రుణమాఫీ చేసిన టీఆర్‌ఎస్, 6 కిలోల బియ్యం వంటి పథకాలను ప్రస్తావిస్తూ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. వీటికితోడు గతానికి, ప్రస్తుతానికి అభివృద్ధిలో తేడా, ఉద్యమ సంఘటనలు, విద్రోహ పార్టీల చరిత్ర, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమరణ దీక్ష వంటి అంశాలతో చాలా గ్రూపుల్లో ప్రచారం జరుగుతున్నది. గత ప్రభుత్వాల్లో వచ్చిన ఉద్యోగాలు, టీఆర్‌ఎస్ సర్కారు ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేష న్లు, ఉద్యోగాలు వంటి వాటిని వాట్సాప్ గ్రూఫుల్లో చర్చిస్తున్నారు. నియోజకవర్గాల వారీగా టీఆర్‌ఎస్ అభ్యర్థుల గుణగణాలు, చేసిన అభివృద్ధి పథకాలు కూడా పోస్టు చేస్తున్నారు. ఇలా యువకులు, వృద్ధులు, పదవీ విరమణ పొందిన వా రు, ఆర్టీసీ ఉద్యోగులు, యూత్ అసోసియేషన్లు, రైతులు, ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు ప్రతి ఒక్కరూ టీఆర్‌ఎస్‌కు ఓటువేసి మరోసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ను గెలిపించాలని పోస్టులు పెడుతున్నారు. దీనికోసం బంధువులు, స్నేహితులు, పరిచయస్తులతో గ్రూఫులు ఏర్పాటు చేస్తున్నారు. సభలు, సమావేశాలతో పోలిస్తే పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా ప్రచారం జరుగుతున్నది.

Related Stories: