వరుసగా నాలుగోసారి రష్యా అధ్యక్షుడిగా పుతిన్

మాస్కో: ప్రస్తుత రష్యా అధ్యక్షుడు పుతిన్ వరుసగా నాలుగోసారి అధ్యక్ష పదవి చేపట్టనున్నారు. పుతిన్ రష్యా అధ్యక్ష బాధ్యతులు స్వీకరించడం లాంఛనమే కానుంది. మెజారిటీ శాతం ఓట్లు పుతిన్‌కు పడినట్లు ఎగ్జిట్‌పోల్‌లో వెల్లడైంది. ఆదివారం జరిగిన ఎన్నికల్లో పుతిన్‌కు 73.9 శాతం ఓట్లు వచ్చినట్లు సమాచారం. రష్య వ్యాప్తంగా 10కోట్ల 7 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. రష్యా అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల్లో పుతిన్‌తో పాటు ఏడుగురు అభ్యర్థులు పోటీ చేశారు. న్యాయపరమైన కారణాలతో ప్రధాన ప్రత్యర్థి నావెల్ని పోటీ నుంచి తప్పుకున్నాడు. దాదాపు రెండు దశాబ్ధాలుగా పుతిన్ అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడు.

Related Stories: