వివో నుంచి జడ్1 లైట్ స్మార్ట్‌ఫోన్

మొబైల్స్ తయారీదారు వివో తన నూతన స్మార్ట్‌ఫోన్ జడ్1 లైట్‌ను త్వరలో విడుదల చేయనుంది. రూ.11,470 ధరకు ఈ ఫోన్ లభ్యం కానుంది. ఇందులో 6.26 ఇంచుల భారీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. 16, 2 మెగాపిక్సల్ కెమెరాలు రెండు ఈ ఫోన్‌కు వెనుక భాగంలో ఉన్నాయి. ముందు భాగంలో 16 మెగాపిక్సల్ కెమెరాను అమర్చారు. దీనికి ఫేస్ అన్‌లాక్ సదుపాయాన్ని అందిస్తున్నారు. ఇందులో మెమొరీ కార్డు కోసం డెడికేటెడ్ స్లాట్‌ను ఏర్పాటు చేశారు. ఫోన్‌కు వెనుక భాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది.

వివో జడ్1 లైట్ ఫీచర్లు...

6.26 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2280 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2.2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 626 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 16, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3260 ఎంఏహెచ్ బ్యాటరీ.

Related Stories: