ఆకట్టుకునే ఫీచర్లతో విడుదలైన వివో వి11 ప్రొ స్మార్ట్‌ఫోన్

మొబైల్స్ తయారీదారు వివో తన నూతన స్మార్ట్‌ఫోన్ వి11 ప్రొ ను ఇవాళ విడుదల చేసింది. రూ.25,990 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు అమెజాన్ సైట్‌లో లభిస్తున్నది. ఈ ఫోన్‌లో పలు ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తున్నారు. ఇందులో 6.41 ఇంచుల భారీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. 6 జీబీ పవర్‌ఫుల్ ర్యామ్‌ను అమర్చారు. వెనుక భాగంలో 12, 5 మెగాపిక్సల్ డ్యుయల్ కెమెరాలను అమర్చారు. ముందు భాగంలో 25 మెగాపిక్సల్ కెమెరాను ఏర్పాటు చేశారు. దీనికి ఫేస్ అన్‌లాక్ సదుపాయాన్ని కల్పించారు. ఈ ఫోన్‌లో మెమొరీ కార్డు కోసం డెడికేటెడ్ స్లాట్‌ను ఏర్పాటు చేశారు.

వివో వి11 ప్రొ ఫీచర్లు...

6.41 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, 1080 x 2340 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 660 ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 12, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 25 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఐఆర్ ఫేస్ అన్‌లాక్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0 ఎల్‌ఈ, 3400 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.
× RELATED మెయ్‌జు ఎక్స్8 స్మార్ట్‌ఫోన్ విడుదల