గిల్‌క్రిస్ట్‌తో కోహ్లీ ముచ్చ‌ట్లు..

బ్రిస్బేన్: ఆస్ట్రేలియాతో బుధ‌వారం జ‌రిగే మొద‌టి టీ20 మ్యాచ్ కోసం టీమిండియా ప్లేయ‌ర్లు ఇవాళ నెట్స్‌లో బిజీ బిజీగా గ‌డిపారు. ఆదివార‌మే గ‌బ్బా స్టేడియంలో ఫ‌స్ట్ ట్రైనింగ్ సెష‌న్‌లో పాల్గొన్నారు. ఇవాళ రెండ‌వ రోజు కూడా కోహ్లీ టీమ్ నెట్స్‌లో పాల్గొన్న‌ది. మాజీ ఆసీస్ వికెట్ కీప‌ర్ ఆడ‌మ్ గిల్‌క్రిస్ట్‌తో ఇవాళ కోహ్లీ కొంత సేపు స‌ర‌దాగా మాట్లాడారు. ఆ ఫోటోల‌ను బీసీసీఐ త‌న ట్విట్ట‌ర్‌లో పోస్టు చేసింది. కోహ్లీతో పాటు ధావ‌న్‌, రాహుల్‌లు కూడా కొంత సేపు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశారు. బౌల‌ర్ బుమ్రా కూడా బ్యాటింగ్ ప్రాక్టీస్ చేయ‌డం విశేషం.

Related Stories: