మ‌ణిక‌ర్ణిక చిత్రాన్ని కంగ‌నా తెర‌కెక్కించిందా..!

కంగ‌నా ర‌నౌత్‌.. కాంట్ర‌వ‌ర్సీస్‌కి కేరాఫ్ అడ్రెస్. ఆమె న‌టించిన మ‌ణికర్ణిక ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ చిత్రం జ‌న‌వ‌రి 25, 2019న‌ విడుద‌ల కానుంది. ఝాన్సీ ల‌క్ష్మీ బాయి జీవిత నేప‌థ్యంలో మ‌ణిక‌ర్ణిక‌ సినిమాని క్రిష్ తెరెక్కించారు. ప్ర‌స్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటుంది. అయితే కొద్ది రోజులుగా ఈ చిత్రానికి సంబంధించి వ‌స్తున్న వార్త‌లు ఫ్యాన్స్‌కి షాక్ ఇస్తున్నాయి. ఆ మ‌ధ్య క్రిష్‌, కంగ‌నాకి గొడ‌వ జ‌రిగిందని ఈ నేపథ్యంలో సినిమా రిలీజ్ లేట్ అవుతుంద‌ని అన్నారు. ఈ వార్త‌ల‌ని చిత్ర యూనిట్ కొట్టి పారేసింది. ఇక తాజాగా చిత్రానికి సంబంధించిన‌ క్లాప్ బోర్డ్‌పై డైరెక్ట‌ర్ ప్లేస్‌లో కంగ‌నా ర‌నౌత్ పేరు ఉండ‌డంతో అభిమానుల‌లో మరోసారి అనుమానం మొద‌లైంది. ఈ విష‌యంపై అభిమానులు ద‌ర్శ‌కుడితో పాటు కంగ‌నాని ట్విట్ట‌ర్ వేదిక‌గా ప్ర‌శ్నించారు . దీంతో కంగ‌నా వెంట‌నే స్పందించింది. క్రిష్ తాను ఒప్పుకున్న వేరే సినిమాతో బిజీగా ఉండ‌డం వ‌ల‌న మేము ప్యాచ్ వ‌ర్క్‌పూర్తి చేశాం. అంతే కాని పూర్తి ద‌ర్శ‌క‌త్వ బాధ్య‌త‌లు స్వీక‌రించ‌లేదు. సెట్లో ఉన్న క్లాప్ బోర్డ్ ఇంత గంద‌ర‌గోళం సృష్టిస్తుంది. ప్ర‌స్తుతం సినిమా వ‌ర్క్ అంతా స‌వ్యంగా జ‌రుగుతుంది. అనుకున్న స‌మ‌యానికే మూవీ రిలీజ్ అవుతుంద‌ని క్లారిటీ ఇచ్చింది కంగ‌నా.

Related Stories: