హిజ్రా పాత్రకు టాప్ స్టార్ సరే అన్నారట

వైవిధ్యమైన పాత్రలకు కేరాఫ్ అడ్రెస్‌గా మారిన విక్రమ్ మరో డిఫరెంట్ రోల్‌లో నటించేందుకు సిద్దమయ్యారు. సినిమా హిట్టా ఫట్టా అనే దానిపై సంబంధం లేకుండా తనకు నచ్చిన పాత్రలలో నటించే విక్రమ్ కోలీవుడ్, టాలీవుడ్ ప్రేక్షకుల మనసులను మరింత గెలుచుకున్నారు. ఇటీవల ఐ లాంటి ప్రయోగాత్మక చిత్రంతో ప్రేక్షకులను అలరించిన విక్రమ్ సరిక్రొత్త పాత్రలో కనిపించేందుకు సిద్దమయ్యారు. విక్రమ్ నటించిన 10 ఎన్రదకుల్లా చిత్రం ఇటీవల ప్రేక్షకుల ముందుకు రాగా , ఈ చిత్రం ప్రేక్షకుల మనసులను అంతగా గెలుచుకోలేకపోయింది. దీంతో ఈ సారి పక్కా పవర్‌ఫుల్ మూవీని చేయాలని భావించిన విక్రమ్ ఆనంద్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ప్రాజెక్ట్‌లో హిజ్రాగా నటించడానికి ఓకే అన్నారట. ఈ సినిమాలో విక్రమ్ రెండు పాత్రలలో కనిపించనుండగా, ఒక పాత్రలో హీరోగా మరో పాత్రలో విలన్‌గా కనిపించనున్నారట. ఆ విలన్ పాత్రలోనే విక్రమ్ హిజ్రాగా కనిపించనున్నారట. మలేషియాలో షూటింగ్ జరుపుకోనున్న ఈ చిత్రంలో నయనతార, నిత్యామీనన్‌లు హీరోయిన్లుగా నటించనుండగా, ఈ చిత్రం విక్రమ్‌కు బిగ్ హిట్‌ని అందిస్తుందో లేదా అనేది తెలియాలంటే కొన్ని రోజులు ఆగక తప్పదు మరి

Related Stories: