విజేత ఆడియో వేడుక‌కి వేదిక సిద్ధం

రాకేశ్ శ‌శి ద‌ర్వ‌క‌త్వంలో చిరు చిన్న అల్లుడు క‌ళ్యాణ్ దేవ్ హీరోగా తెర‌కెక్కిన చిత్రం విజేత‌. వారాహి చలన చిత్రం బ్యానర్ పై ర‌జ‌నీ కొర్ర‌పాటి నిర్మించిన ఈ చిత్రం జూలైలో విడుద‌ల కానుంది. ఈ క్ర‌మంలో చిత్ర యూనిట్ సినిమాపై ఆస‌క్తిని క‌లిగించేలా పోస్టర్స్‌, టీజ‌ర్స్‌, సాంగ్స్ విడుద‌ల చేస్తున్నారు. సినిమా నుండి ఇప్ప‌టికే వ‌చ్చిన ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్, టీజ‌ర్‌కి సూప‌ర్బ్ రెస్పాన్స్ వ‌చ్చింది.ఇటీవ‌ల‌ కోడికి సంతాపాన్ని తెలియజేస్తూ హీరో పాడే 'కొక్కొరోకో .. ' పాటని రిలీజ్ చేశారు. దీనికి కూడా సూప‌ర్బ్ రెస్పాన్స్ వ‌స్తుంది. ఈ సాంగ్ మాస్ ప్రేక్ష‌కుల‌కి మాంచి కిక్ ఇస్తుంద‌నే చెప్ప‌వచ్చు. రామ‌జోగయ్య శాస్త్రి ఈ సాంగ్‌కి లిరిక్స్ అందించ‌గా, లోకేశ్వ‌ర్ గాత్రాన్ని అందించారు. నేడు చిత్ర ఆడియో వేడుకను హైదరాబాద్‌లోని జే.ఆర్.సి కన్వెన్షన్ సెంటర్లో ఘనంగా జరపనున్నారు. చిరంజీవి ముఖ్య అతిధిగా ఆడియో వేడుక జ‌ర‌గ‌నుంది. రామ్ చ‌ర‌ణ్‌, అల్లు అర్జున్‌ల‌తో పాటు బాల‌య్య కూడా పాట‌ల పండుగ కార్య‌క్ర‌మానికి హాజ‌రుకానున్నారని స‌మాచారం. హర్షవర్ధన్ రామేశ్వర్ అందించిన సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు. తనికెళ్ళభరణి, మురళీ శర్మ, నాజర్, సత్యం రాజేష్, ప్రగతి, కళ్యాణి నటరాజన్, పోసాని కృష్ణమురళి, రాజీవ్ కనకాల, జయప్రకాష్ (తమిళ నటుడు), ఆదర్ష్ బాలకృష్ణ, నోయల్, కిరీటి, భద్రమ్ తదితరులు కీలక పాత్రలలో నటించారు. మాళ‌విక శ‌ర్మ చిత్రంలో క‌థానాయిక‌గా న‌టించింది .

Related Stories: