మూడో స్థానానికే పరిమితమైన విజేందర్ సింగ్

న్యూఢిల్లీ: దకిణ ఢిల్లీ లోక్ సభ స్థానం నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసిన బాక్సర్ విజేందర్‌ సింగ్‌ ఓటమిని చవిచూశారు. మొదటిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొన్న విజేందర్‌ సింగ్‌ మూడో స్థానానికే పరిమితమయ్యారు. దక్షిణ ఢిల్లీ నుంచి బీజేపీ అభ్యర్థి (సిట్టింగ్ ఎంపీ) రమేష్ బిధూరీ 6 లక్షల పై చిలుకు ఓట్లతో ఘన విజయం సాధించగా..ఆప్‌ అభ్యర్థి రాఘవ్‌ చాధా 3,18,584 ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. విజేందర్ సింగ్ 1,64,158 ఓట్లకు మాత్రమే పరిమితమై..కనీస పోటీని కూడా ఇవ్వలేకపోయారు.