స్టైలిష్ లుక్‌లో ఇల‌య‌ద‌ళ‌ప‌తి

ఇల‌య‌ద‌ళ‌ప‌తి విజ‌య్‌కి త‌మిళంలో ఏ రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్ప‌నక్క‌ర్లేదు. ఆయ‌న సినిమా కోసం అభిమానులు వేయి క‌ళ్ళ‌తో ఎదురు చూస్తుంటారు. ఇటీవ‌ల‌ మెర్స‌ల్ చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన విజ‌య్ ఈ చిత్రంతో కాస్త నిరాశ‌ప‌ర‌చాడు. దీంతో అభిమానులు విజ‌య్ తదుప‌రి సినిమాపై చాలా ఆస‌క్తి క‌న‌బ‌రుస్తున్నారు. స్టార్‌ డైరెక్ట‌ర్ మురుగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో విజ‌య్ త‌న 62వ సినిమా చేస్తున్నాడు. సన్ పిక్చ‌ర్స్ నిర్మించ‌నున్న ఈ చిత్రానికి గిరీష్ గంగాధ‌న్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేయ‌నుండ‌గా, శ్రీక‌ర్ ప్ర‌సాద్ ఎడిట‌ర్‌గా, టీ సంతానం ఆర్ట్ డైరెక్ట‌ర్‌గా పని చేస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ చిత్రం చెన్నైలోని వివిధ ప్రాంతాల‌లో షూటింగ్ జ‌రుపుకుంటుంది. తాజాగా చిత్రంలో విజ‌య్ లుక్‌కి సంబంధించిన లుక్ ఒక‌టి సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుంది. బ్లాక్ సూట్‌లో అభిమానులు మెచ్చే విధంగా స్టైలిష్‌గా క‌నిపిస్తున్నాడు. కీర్తి సురేష్ క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రానికి ఏఆర్ రెహ‌మాన్ సంగీతం అందిస్తున్నాడు. దీపావ‌ళి కానుక‌గా ఈ చిత్రం విడుద‌ల కానుంది. తుపాకి, క‌త్తి వంటి చిత్రాలు విజ‌య్ - మురుగ‌దాస్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కి మంచి విజ‌యం సాధించగా, తాజా చిత్రంతో హ్య‌ట్రిక్ కొడ‌తారని అభిమానులు భావిస్తున్నారు.

Related Stories: