విజ‌య్ పొలిటిక‌ల్ ఎంట్రీపై చిన్న క్లారిటీ ఇచ్చిన కో స్టార్

కొన్ని త‌రాల క్రితం సినీసెల‌బ్రిటీస్‌ని బేస్ చేసుకొనే రాజ‌కీయాలు న‌డిచాయి. తెలుగు రాష్ట్రానికి నంద‌మూరి తార‌క రామారావు ముఖ్య మంత్రి కాగా, త‌మిళ నాడు రాజ‌కీయాల‌ని ఎంజీ రామ చంద్రన్, జ‌య‌ల‌లిత‌లు న‌డిపించారు. ఇప్పుడు ఈ త‌రంలోను సినీ సెల‌బ్రిటీల హ‌డావిడి చూస్తుంటే వీరు రాజ‌కీయాల‌లో కొత్త ఒర‌వడిని సృష్టించ‌నున్నారా అనే అభిప్రాయం జ‌నాల‌లో క‌లుగుతుంది. పవ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇప్పటికే జ‌న‌సేన పార్టీని స్థాపించి రాజ‌కీయాల‌కి త‌న అవ‌స‌రం త‌ప్పక ఉంద‌నే అభిప్రాయాన్ని జ‌నాల‌లో క‌లిగిస్తున్నాడు. ఇక జ‌య‌ల‌లిత మ‌ర‌ణంతో త‌మిళ రాష్ట్రాల‌లో రజ‌నీకాంత్‌, క‌మ‌ల్ హాస‌న్‌లు రాజ‌కీయాల‌ని పూర్తిగా మార్చాల‌ని భావిస్తున్నారు. క‌న్నడ న‌టుడు ఉపేంద్ర క‌ర్ణాటక ప్రజ్ఞావంత జనతాపక్ష పార్టీ అని ఎనౌన్స్ చేసి , ప్రజల కోసం తన పార్టీ ఓ వేదికగా మారిందని, తన లక్ష్యాలతో ఏకీభవించే వారు త‌న‌తో న‌డ‌వ‌చ్చని అన్నాడు. అయితే త‌మిళంలో ర‌జ‌నీకాంత్‌తో స‌మానంగా మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న న‌టుడు విజ‌య్. ఎప్పటి నుండో రాజ‌కీయాల‌లోకి ఆయ‌న ఎంట్రీ ఖాయ‌మ‌ని చెబుతున్నారు . గ‌తంలో విజ‌య్ తండ్రి, దర్శకుడు ఎస్‌ఏ.చంద్రశేఖర్‌ తన కొడుకు రాజకీయాల్లో వస్తారని చాలా సార్లు బహిరంగంగానే వెల్లడించారు. ఆ మ‌ధ్య విజయ్ అభిమానులు తమ హీరో పేరిట 'విజయ్‌ ప్రజా సంఘం' పేరుతో నూతన వెబ్‌ సైట్‌ ను ప్రారంభించి తద్వారా ప్రజలను సభ్యులుగా చేర్చే పనికి శ్రీకారం చుట్టారు. తమ హీరోకు రాజకీయాలపై ఆసక్తి ఉందని, ఎప్పుడైనా రాజకీయరంగ ప్రవేశం గురించి వెల్లడించే అవకాశం ఉండడంతో తాము సభ్యత్వ నమోదు కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని చెప్పారు. తాజాగా స‌ర్కార్ కో స్టార్ రాధా ర‌వి.. ఇల‌య‌ద‌ళ‌ప‌తి త‌న పొలిటిక‌ల్ కెరీర్‌ని నెమ్మ‌దిగా నిర్మించుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నాడు. రాజ‌కీయ ఎత్తుగ‌డ‌లు కూడా నేర్చుకుంటున్నాడు అని అన్నారు. నిజంగా విజ‌య్ కూడా రాజ‌కీయాల‌లోకి వ‌స్తే త‌మిళ నాట క‌మ‌ల్‌, ర‌జ‌నీకాంత్‌, విజ‌య్‌ల మ‌ధ్య గ‌ట్టి పోటీ ఉంటుంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు.

Related Stories: