బిగ్‌బీ అవార్డు అందుకున్న విజ‌య్ సేతుప‌తి

ఈ నెల 14 వ తేదీ నుండి చెన్నైలో 15వ అంతర్జాతీయ చిత్రోత్స‌వం జ‌రుగుతున్న సంగతి తెలిసిందే. ఈ గురువారంతో వేడుక‌లు ముగిశాయి. అయితే చివ‌రి రోజు స్థానిక దేవి థియేట‌ర్‌లో ముగింపు కార్య‌క్ర‌మంలో భాగంగా పలు అవార్డులు అందించారు. ఉత్తమ చిత్రం అవార్డును ఒరు కిడారియిన్‌ కరుణై మను గెలుచుకుంది. సురేశ్‌ చంగయ్య ఈ చిత్రానికి దర్శకత్వం వ‌హించారు. ఇక ద్వితీయ ఉత్తమ చిత్రంగా విక్రమ్‌వేదా అవార్డు గెలుచుకుంది. అలాగే ఈ మూవీలో అద్వితీయ న‌ట‌న క‌న‌బ‌ర‌చిన త‌మిళ స్టార్ హీరో విజ‌య్ సేతుప‌తికి బాలీవుడ్ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ పేరుతో అందించే అవార్డుని ఇచ్చారు. కురంగుబొమ్మై చిత్రంలో నటించిన ప్రముఖ దర్శకుడు భారతీరాజా ప్రత్యేక జ్యూరీ అవార్డును అందుకున్నారు. నటనా శిక్షణ విద్యార్థుల కోసం నెలకొల్పిన అమ్మ అవార్డును డెయిసీ చిత్రం గెలుచుకుంది. ఈ చిత్రానికి ఏ.నారాయణమూర్తి దర్వకత్వం వహించారు. అలాగే లోకేశ్‌ కనకరాజ్‌ దర్శకత్వం వహించిన మానగరం చిత్రం ప్రత్యేక జ్యూరీ అవార్డును గెలుచుకుంది. నటుడు కే.భాగ్యరాజ్, సుహాసిని, మనోబాలతో పాటు ప‌లువురు సినీ ప్ర‌ముఖులు ఈ వేడుక‌లో పాల్గొన్నారు.

Related Stories: