న‌య‌న‌తార సినిమాలో విజ‌య్ పాత్ర ఇదే..!

లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార ద‌క్షిణాదిలో వ‌రుస సినిమాల‌తో బిజీగా ఉంది. ప్ర‌స్తుతం అజ‌య్ జ్ఞాన‌ముత్తు ద‌ర్శ‌క‌త్వంలో యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ ఇమైక్కా నోడిగ‌ల్ అనే చిత్రం చేస్తుంది. ఇందులో మ‌క్క‌ల్ సెల్వ‌న్ విజ‌య్ సేతుప‌తి ముఖ్య పాత్ర పోషించ‌నున్న‌ట్టు కొన్నాళ్లుగా వార్త‌లు వ‌చ్చాయి. ఈ క్ర‌మంలో న‌య‌న‌తార భ‌ర్త‌గా ప‌దిహేను నిమిషాలు విజ‌య్ సేతుప‌తి క‌నిపించ‌నున్నాడ‌ని ద‌ర్శ‌కుడు తెలిపారు. ఇద్ద‌రి మీద ఓ సాంగ్ కూడా చిత్రీక‌రించిన‌ట్టు స‌మాచారం. ప్ర‌స్తుతం ఇమైక్కా నోడిగ‌ల్ చిత్రం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటుంది. ఈ చిత్ర ఆడియో వేడుక నిన్న గ్రాండ్‌గా జ‌ర‌గ‌గా, నేడు చిత్ర ట్రైలర్ విడుద‌ల చేయ‌నున్నారు. ఈ సినిమాతో మ‌రో భారీ హిట్ త‌న ఖాతాలో వేసుకోవాల‌ని న‌య‌న భావిస్తుంది. ఇదిలా ఉండ‌గా న‌య‌న‌తార, ద‌ర్శ‌కుడు విఘ్నేష్ శివ‌న్‌తో క‌లిసి కొన్నాళ్ళుగా ప్రేమాయ‌ణం న‌డిపిస్తుంది. ఇటీవ‌ల వారిరివురు త‌మ ప్రేమాయ‌ణం గురించి ఇన్‌డైరెక్ట్ హింట్స్ ఇస్తున్నారు. త్వ‌ర‌లోనే పెళ్లి పీట‌లు కూడా ఎక్కేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు.

Related Stories: