విజయ్ మాల్యా ఆస్తుల జప్తు

న్యూఢిల్లీ: కింగ్ ఫిషర్ అధినేత, లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాపై ఈడీ కొరడా ఝళిపించింది. ఆయనకు పలుచోట్ల ఉన్న ఆస్తులను జప్తు చేసుకుంది. బెంగళూరు, ముంబై సహా ఇతర ప్రాంతాల్లోని మాల్యాకు చెందిన రూ.6,630 కోట్ల ఆస్తులను స్వాధీనం చేసుకుంది. కాగా, దేశంలోని వివిధ బ్యాంకుల నుంచి రూ.9 వేల కోట్లకు పైగా రుణాలు తీసుకుని ఎగవేశాడనే ఆరోపణలపై మాల్యాపై కేసు నమోదైంది. కాగా, కేసు విచారణలో ఉండగానే మాల్యా దేశం విడిచి లండన్‌లో ఆశ్రయం పొందుతోన్న విషయం తెలిసిందే. అప్పటి నుంచి మాల్యాను తిరిగి దేశానికి ఈడీ అధికారులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.
× RELATED కుంభమేళాతో రూ.1.2 లక్షల కోట్ల ఆదాయం