అది అవాస్తవం: అరుణ్‌జైట్లీ

న్యూఢిల్లీ: బ్యాంకులకు సెటిల్‌మెంట్ చేసే విషయంలో తనను కలిసినట్లుగా చెప్పిన విజయ్ మాల్యా వ్యాఖ్యలు అవాస్తవం అని ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ అన్నారు. దేశం విడిచి వెళ్లేముందు బ్యాంకులతో సెటిల్‌మెంట్ విషయంలో ఆర్థికమంత్రిని కలిసినట్లుగా చెప్పిన మాల్యా వ్యాఖ్యలపై అరుణ్‌జైట్లీ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన ఓ ప్రెస్ నోట్ విడుదల చేశారు. రాజ్యసభ ఎంపీగా ఉన్న విజయ్ మాల్యా సభ సమావేశాలకు ఎప్పుడో ఓసారి వచ్చేవాడు. ఓసారి సభ నుంచి బయటకు వచ్చి నా గదికి వెళ్తుండగా కారిడార్‌లో ఎదురుపడ్డాడు. అలా నడుస్తూనే బ్యాంకులతో సెటిల్‌మెంట్ ఆఫర్ చేస్తున్నట్లు చెప్పాడు. అంతే. అంతటితో నేను అతడిని ఇంకో మాట మాట్లాడనీయలేదు. ఆ విషయం గురించి నాతో మాట్లాడాల్సిన పనిలేదన్నాను. అతను చెబుతున్నట్లుగా తనకు ఏ పేపర్లను చేరలేదన్నారు. ఆ ఒక్క మాట తప్ప విజయ్ మాల్యాకు తానెప్పుడు ఆపాయింట్‌మెంట్ ఇవ్వలేదన్నారు.
More in తాజా వార్తలు :