విజయ్ మాల్యా కేసు మళ్లీ వాయిదా

న్యూఢిల్లీ: బ్యాంకుకు వేల కోట్ల రుణాలు ఎగ‌గొట్టిన విజ‌య్ మాల్యా కేసును సుప్రీంకోర్టు వాయిదా వేసింది. రుణాల ఎగ‌వేత‌ కేసును మార్చి 9వ తేదీకి వాయిదా వేస్తూ ఇవాళ సుప్రీం తీర్పునిచ్చింది. మ‌రోవైపు త‌న కింగ్‌ఫిష‌ర్ ఎయిర్‌లైన్స్ దివాళా తీసిన అంశంపై మాల్యా తాజాగా ఓ ట్వీట్ చేశారు. ప్రాట్ అండ్ విట్నీ ఇంజిన్లు విఫ‌లం అవ్వ‌డం వ‌ల్లే కింగ్‌ఫిష‌ర్ ఎయిర్‌లైన్స్ న‌ష్ట‌పోయింద‌న్నారు. నాసిరకంగా ఇంజిన్లు సరఫరా చేసిన ప్రాట్ కంపెనీ నుంచి నష్టపరిహారం కోరినట్లు మాల్యా ట్వీట్ లో తెలిపారు.

Related Stories: