సెప్టెంబర్ 3న మాల్యా కేసు విచారణ

ముంబై: వివిధ బ్యాంకులకు రూ.9 వేల కోట్లు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాను ఆర్థిక నేరస్తుడిగా గుర్తించే కేసును వచ్చే నెల 3న ప్రత్యేక కోర్టు విచారించనున్నది. నూతన చట్టానికి లోబడి మాల్యా కుటుంబ సభ్యులతో పాటు మరో నలుగురు వ్యక్తులను నేరస్తులుగా గుర్తించడానికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సమర్పించిన పత్రాలు ఈ విచారణలో కీలకం కానున్నాయి. ఇందుకు సంబంధించి వచ్చే వారంలో ఈ కేసు విచారణకు రానున్నదని ప్రత్యేక కోర్టు జడ్జి ఎంఎస్ అజ్మీ ఆదేశాలు జారీ చేశారు. సోమవారం ప్రత్యేక కోర్టుకు మాల్యా హాజరుకావాలని ఆదేశించినప్పటికీ ఆయన హాజరుకాలేదు. మాల్యాకు వ్యతిరేకంగా ఈడీ దాఖలు చేసిన రెండు కేసులపై ఈ కోర్టు నాన్-బెయిలబుల్ వారెంట్‌ను జారీ చేసిన విషయం తెలిసిందే.
× RELATED ఛత్తీస్‌గఢ్‌లో రేపు రెండో విడత పోలింగ్