మ్యూజిక్ వీడియోతో రానున్న విజ‌య్ దేవర‌కొండ‌

అర్జున్ రెడ్డి సినిమాతో ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న విజ‌య్ దేవ‌ర‌కొండ వ‌రుస పెట్టి ప్రాజెక్టులు చేస్తున్నాడు. త్వ‌ర‌లో ఆయ‌న న‌టించిన టాక్సీవాలా చిత్రం విడుద‌ల కానుండ‌గా, గీత గోవిందం, నోటా, కామ్రేడ్ సినిమాలు షూటింగ్ జ‌రుపుకుంటున్నాయి. మరి ఇంత బిజీ షెడ్యూల్‌లోను విజ‌య్ దేవ‌ర‌కొండ ఓ మ్యూజిక్ వీడియో చేయ‌డం విశేషం. తెలుగు, త‌మిళం, హిందీ భాష‌ల‌లో రూపొంద‌నున్న ఈ వీడియోకి న‌యనోంకి ఆర్జియాన్ అనే టైటిల్ పెట్టారు. భానుశ్రీ తేజ ద‌ర్శ‌క‌త్వంలో ఈ వీడియోని రూపొందిస్తున్నారు. సౌర‌భ్‌, దుర్గేష్‌లు సంగీతం అందిస్తుండ‌గా, బెంగాలీ మోడ‌ల్ మాళ‌విక బెన‌ర్జీ... విజ‌య్ దేవ‌ర‌కొండ స‌ర‌స‌న ఆడిపాడ‌నుంది.ఈ మ్యూజిక్ వీడియోకి సంబంధించిన షూటింగ్ ఇప్ప‌టికే పూర్తి కాగా, త్వ‌ర‌లోనే దీనిని విడుద‌ల చేయ‌నున్నారు.
× RELATED యోగా టీచర్ కావాలనుకునే వారికి సువర్ణావకాశం..