మ‌హ‌ర్షి సెట్‌లో విజ‌య్ దేవ‌ర‌కొండ‌

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ప్ర‌ధాన పాత్ర‌లో వంశీ పైడిప‌ల్లి మ‌హ‌ర్షి అనే సినిమా తెర‌కెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే. శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ చిత్రం 2019 ఏప్రిల్ 5న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. పూజా హెగ్డే చిత్రంలో కథానాయిక‌గా న‌టిస్తుంది. దేవి శ్రీ ప్ర‌సాద్ స్వ‌రాలు స‌మ‌కూరుస్తున్నాడు. ఇటీవ‌ల చిత్రానికి సంబంధించిన ఫోటోలు లీక్ కాగా, అవి ప్రేక్ష‌కుల‌లో భారీ అంచనాలు పెంచాయి. దిల్‌రాజు, అశ్విని దత్‌, పీవీపీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో మ‌హేష్ విద్యార్ధిగా, యూఎస్ కంపెనీ సీఈవోగా క‌నిపించ‌నున్నాడు. ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లో షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ చిత్ర సెట్లో విజ‌య్ దేవ‌ర‌కొండ ప్ర‌త్య‌క్ష‌మ‌య్యాడు. మ‌హేష్‌, వంశీ పైడిప‌ల్లితో క‌లిసి ఫోటో దిగాడు. ఆ ఫోటోని త‌న ట్విట్ట‌ర్‌లో షేర్ చేసిన విజ‌య్ .. ఒక‌ప్పుడు మ‌హేష్ మూవీ టిక్కెట్స్ కోసం పోట్లాడిన నేను, సినిమా గురించి మ‌హేష్ తో చ‌ర్చించడం చాలా ఆనందంగా ఉంద‌ని కామెంట్ పెట్టాడు. విజ‌య్ న‌టించిన తాజా చిత్రం గీతా గోవిందం ఆగ‌స్ట్ 15న విడుద‌లై బాక్సాఫీస్ ద‌గ్గ‌ర భారీ వ‌సూళ్ళు రాబ‌డుతున్న సంగ‌తి తెలిసిందే.
× RELATED సీయం కేసీఆర్ నిర్మ‌ల్ స‌భ‌ ఏర్పాట్ల పరిశీలన