కుక్కమాంసం, పిల్లిమాంసం తినొద్దు నాయనలారా!

తూర్పు ఆసియా దేశాల్లో కుక్క, పిల్లి మాంసం బాగా తింటారు. చైనాలో అయితే మరీ ఎక్కువ. వియత్నాం కూడా దీనికి మినహాయింపు ఏమీ కాదు. అయితే ప్రజలు ఎగబడి కుక్కలు, పిల్లుల మాంసం తినడం వల్ల దేశానికి చెడ్డపేరు వస్తున్నదని వియత్నాం సర్కారు తన పౌరులకు విజ్ఞప్తి చేసింది. విదేశీ పర్యాటకులు అయిష్ట పడడమే దీనికి ప్రధాన కారణం. సంపన్న దేశాలనుంచి వచ్చేవారిలో చాలామందికి కుక్క, పిల్లి వంటి పెంపుడు జంతువులు ఉంటాయి. వారు వియత్నాం వచ్చినప్పుడు కుక్క, పిల్లి మాంసం కబేళాలు, అంగళ్లు చూసి ఇదేమి పాపం అని నోరు నొక్కుకోవడం జరుగుతున్నది. హోటళ్ల మెనూలో అవే ఉండడం కూడా వారికి నచ్చడం లేదు. ఇలా అనవసరంగా టూరిస్టులను దూరం చేసుకునే బదులు ప్రజలు ఆ రెండు రకాల మాంసాలు తినకుండా ఉంటే బాగుంటుందని వియత్నాం ప్రభుత్వం పై విజ్ఞప్తిని జారీచేసింది. రేబిస్ వ్యాధి విస్తరణను అడ్డుకోవడం కూడా ఈ విజ్ఞప్తి వెనుకగల మరో కారణం. ముఖ్యంగా కుక్క మాంసం తినేవారిలో ఈ వ్యాధి వ్యాపించే అవకాశాలుంటాయి.

Related Stories: