వేలాది చేపలు.. విమానం ద్వారా చెరువులోకి.. వీడియో

యుటా: ఈ వీడియో మిమ్మల్ని కచ్చితంగా ఆశ్చర్యపరుస్తుంది. ఓ విమానంలో వేలాది చేపలను తీసుకెళ్లి.. వాటిని కొండప్రాంతంలో ఉన్న ఓ చెరువలోకి జారవిడుస్తున్నారు. అమెరికాలోని యుటా రాష్ట్రంలో అక్కడి వైల్డ్‌లైఫ్ రీసోర్సెస్ ఈ పని చేస్తున్నది. కొండ ప్రాంతాల్లోని చెరువుల్లో చేపల పెంపకానికి ఈ పద్ధతి ఈజీగా ఉండటంతో అక్కడి అధికారులు కొన్నాళ్లుగా ఇదే ఫాలో అవుతున్నారు. విమానం కింది భాగంలో ఉన్న భారీ రంధ్రం నుంచి వేలాది చేపలను కింద ఉన్న చెరువులోకి జార విడుస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారిపోయింది. తాము ఎందుకు విమానాన్ని దీనికోసం ఎంపిక చేసుకున్నామన్న విషయాన్ని వీడియోలోనే వివరించారు. గతంలో పాల క్యాన్లలో చేపలను వేసి, వాటిని గుర్రాలపై పైకి తరలించి చెరువుల్లో వేసేవాళ్లు. కానీ అదంతా చాలా సమయం తీసుకునే ప్రక్రియ కావడంతో విమానాన్ని ఆశ్రయించారు. ఇవన్నీ చిన్నచిన్న చేప పిల్లలు కావడంతో అంత ఎత్తు నుంచి కింద పడినా వాటిలో 95 శాతం వరకు బతికే ఉంటున్నాయి.

× RELATED 'పంచాయతీ'ఎన్నికల పోలింగ్ ప్రారంభం