పాఠాలు బోర్ కొట్టాయేమో.. ఈ చిన్ని విద్యార్థిని ఎలా నిద్రపోతుందో చూడండి!

నిద్రకు చిన్నాపెద్ద తేడా లేదు. నిద్రను ఆపుకోవడం ఎవరి తరమూ కాదు. అది ఎప్పుడైనా.. ఎక్కడైనా రావచ్చు. ఆఫీసులో చాలా సీరియస్‌గా పనిచేస్తుంటే సడెన్‌గా ఆవలింత వస్తుంది. అంతే ఆ తర్వాత నిద్ర ముంచుకొస్తుంది. మీటింగ్స్‌లో, ప్రయాణంలో ముఖ్యంగా స్కూళ్లో, కాలేజీలో విద్యార్థులను కూడా నిద్ర తెగ డిస్టర్బ్ చేస్తుంటుంది. ఇప్పుడు మనం చెప్పుకునేది కూడా అలా నిద్రపోయిన వారి గురించే. కాకపోతే ఇక్కడ నిద్రపోయింది ఆఫీసులోనో.. మీటింగ్‌లోనో.. ఇంకా ఎక్కడో కాదు.. ప్లే స్కూల్ విద్యార్థిని తన క్లాస్‌రూమ్‌లో బుజ్జి బుజ్జిగా నిద్రపోయిన తీరు చూసి నెటిజన్లు ముక్కున వేలేసుకుంటున్నారు. ఎక్కడ జరిగిందో తెలియదు కానీ.. ప్లే స్కూల్ విద్యార్థిని క్లాస్‌రూంలో టీచర్ పాఠాలు చెబుతుండగానే తనకు ఏం సంబంధం లేదన్నట్టుగా టేబుల్ మీదే బుక్కును మెత్తగా మార్చుకొని నిద్రపోయింది. ఇది గమనించిన టీచర్ ఆ బుజ్జి పాపాయి నిద్రను వీడియో తీసింది. మధ్యలో పక్కనే ఉన్న‌ మరో స్టూడెంట్ ఆ పాపాయిని లేపడానికి ఎంత ప్రయత్నించినా నిద్ర‌నుంచి తేరుకోలేక పోయింది ఆ చిన్నారి.. ఇక.. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా.. నెటిజన్లు ఆ వీడియోను వైరల్ చేస్తున్నారు.

Related Stories: