కేరళ వరదలు.. నడవలేని వ్యక్తిని కాపాడి హీరోలయిన ఆర్మీ: వీడియో

గత పదిపదిహేను రోజుల నుంచి ప్రపంచ వ్యాప్తంగా కేరళ వరదల గురించే చర్చ. కేరళలో కురిసిన భారీ వర్షాలకు, భారీ వరదలకు కేరళ మొత్తం మునిగిపోయిన సంగతి తెలిసిందే. లక్షల మంది నిరాశ్రయులు కాగా.. వందల మంది భారీ వరదలకు తమ ప్రాణాలను పోగొట్టుకున్నారు. అయితే.. లక్షల మందికి అండగా కోట్లాది మంది నిలిచి మానవత్వాన్ని చాటుకున్నారు. కేరళ వరద బాధితులకు తోచినంత సాయం చేసి అండగా నిలిచారు చాలామంది. మరోవైపు కేరళ వరద బాధితులను రక్షించడానికి రెస్క్యూ టీములు రంగంలోకి దిగాయి. ఇండియన్ ఆర్మీ, నేవీ సిబ్బంది వరదల్లో చిక్కుకున్న చాలామందిని హెలికాప్టర్, పడవల సాయంతో కాపాడారు. వాటికి సంబంధించిన వీడియోలు కూడా ఎన్నో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఓ నిండు గర్భిణీని, వృద్ధులను, పిల్లలను హెలికాప్టర్ సాయంతో ఆర్మీ కాపాడిన వీడియోలను చూశాం. కానీ.. ఇప్పుడు మీరు చూడబోయే వీడియో కొంచెం డిఫరెంట్. ఇంట్లోని మొదటి అంతస్తులో వరదలో చిక్కుకున్న కృత్రిమ కాలుతో ఉన్న ఓ వ్యక్తిని నిచ్చెన సాయంతో ఆర్మీ కాపాడిని తీరును చూసి నెటిజన్లు తెగ మెచ్చుకుంటున్నారు. ఓ ఆర్మీ జవాన్ అతడిని మీద వేసుకొని నిచ్చెన దిగుతూ ఉన్న వీడియోను ఇండియన్ ఆర్మీ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో షేర్ చేసింది. ఆ వీడియోను మెచ్చిన నెటిజన్లు ఇండియన్ ఆర్మీ చేస్తున్న గొప్ప పనికి ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Wherever you are #wewillsaveyou #havefaith #IndianArmy #OpMadad #Keralafloods2018

A post shared by Indian Army (@indianarmy.adgpi) on

Related Stories: