వెంకీ న‌టిస్తున్న మ‌రో మ‌ల్టీ స్టార‌ర్ మొద‌లైంది

గురు చిత్రం త‌ర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న వెంకీ ప్ర‌స్తుతం రెండు మ‌ల్టీ స్టార‌ర్ ప్రాజెక్ట్స్ చేస్తున్నాడు. వ‌రుణ్ తేజ్‌తో క‌లిసి అనీల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో చేస్తున్న ఎఫ్ 2 సినిమా ఇప్ప‌టికే సెట్స్ పైకి వెళ్ల‌గా, రీసెంట్‌గా ప్ర‌ధాన పాత్ర‌ధారులు అంద‌రు టీంతో క‌లిసారు. ఇక ఈ చిత్రంతో పాటు బాబీ ద‌ర్శ‌క‌త్వంలో మ‌రో మ‌ల్టీ స్టార‌ర్ చేస్తున్నాడు వెంకీ. ఇందులో నాగ చైత‌న్య త‌న మామ‌తో స్క్రీన్ షేర్ చేసుకోనున్నాడు. వెంకీ మామ అనే టైటిల్ ఈ చిత్రానికి ప‌రిశీలిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర షూటింగ్ ప్రారంభ‌మైంది. రామానాయుడు స్టూడియోలో గ్రాండ్‌గా జ‌రిగిన పూజా వేడుక‌కి చిత్ర యూనిట్‌కి సంబంధించిన స‌భ్యులు హాజ‌రయ్యారు. చిత్రంలో చైతూ స‌ర‌స‌న ర‌కుల్ ప్రీత్ సింగ్ క‌థ‌నాయిక‌గా న‌టిస్తుంది. 2017లో వ‌చ్చిన రారండోయ్ వేడుక చూద్ధాం చిత్రంలో చైతూ, ర‌కుల్ జంట‌గా న‌టించారు. ఇప్పుడు వీరిద్ద‌రు క‌లిసి న‌టించ‌డం రెండో సారి అవుతుంది. వెంకీ హోమ్ బ్యాన‌ర్ సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ తో పాటు పాపుల‌ర్ రైట‌ర్ కోన వెంక‌ట్ సంస్థ అయిన కోన ఫిలిం కార్పొరేష‌న్ మరియు పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ సంయుక్తంగా ఈ ప్రాజెక్ట్‌ని రూపొందిస్తున్నాయి. ఇటు అనీల్ రావిపూడి చిత్రం అటు బాబీ చిత్ర షూటింగ్‌ల‌లో ఏక‌కాలంలో పాల్గొన‌నున్నాడు వెంకీ.

Related Stories: