మా ఓటు మంత్రి ఈటల రాజేందర్ కే..

కరీంనగర్: అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా పాలన అందిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కు, టీఆర్ఎస్ కు అండగా నిలిచి..గెలిపిస్తామని గౌడ కులస్తులు ప్రతిజ్ఞ చేశారు. ఈ మేరకు హుజురాబాద్ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఈటల రాజేందర్ కే తమ ఓటు వేస్తమని వీణవంక మండల గౌడ సంఘం సభ్యులు తీర్మానం చేశారు. అదేవిధంగా దుర్గేడులో వివిధ కుల సంఘాలు కరీంనగర్ టీఆర్ ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్ కే తమ ఓటు వేస్తామని తీర్మానం చేశాయి.

ఇటీవలే వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ మండలం మర్రిపెల్లిగూడెంలో పద్మశాలి కులస్తులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఈటల రాజేందర్‌ను గెలిపిస్తామని, టీఆర్‌ఎస్‌కే మా ఓటు అని ఏకగ్రీవ తీర్మానం చేసిన విషయం తెలిసిందే.

× RELATED రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి