నెగేటివ్ రోల్ లో వరుణ్ తేజ్..?

నవ్యమైన ఇతివృత్తాలతో సినిమాలు చేస్తూ తెలుగు చిత్రసీమలో ప్రత్యేకతను సృష్టించుకున్నారు హీరో వరుణ్‌తేజ్. తొలి సినిమా నుంచి కథలు, పాత్రల ఎంపికలో విభిన్నంగా అడుగులు వేస్తున్న ఆయన తాజాగా నెగెటివ్ షేడ్స్‌తో కూడిన పాత్రలో కనిపించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సిద్ధార్థ్ కథానాయకుడిగా కార్తిక్ సుబ్బరాజు దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం జిగర్తాండ.

రౌడీలో మార్పు తీసుకొచ్చిన ఓ సినీ దర్శకుడి కథాంశంతో యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం కమర్షియల్‌గా పెద్ద విజయాన్ని సాధించింది. ఈ సినిమాలో ప్రతినాయకుడిగా బాబీసింహా నటనకు విమర్శకుల ప్రశంసలతోపాటు జాతీయ పురస్కారం దక్కింది. ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలిసింది. ఇందులో ప్రతినాయకుడిగా వరుణ్‌తేజ్ నటించనున్నట్లు సమాచారం. ఈ తెలుగు రీమేక్‌కు హరీష్ శంకర్ దర్శకత్వం వహించనున్నట్లు తెలుస్తున్నది. ప్రస్తుతం వరుణ్‌తేజ్ అంతరిక్షం చిత్రంలో నటిస్తున్నారు. సంకల్ప్‌రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 21న విడుదలకానుంది.

Related Stories: