కాస్ట్‌లీ కారు మెగా హీరో సొంతం

ఈ మ‌ధ్య కాలంలో సినిమా స్టార్స్ చాలా రాయల్టీ మెయింటైన్ చేస్తున్నారు. తినే తిండి, ఉండే ఇల్లు, ప్ర‌యాణించే కారు ప్రతీది కూడా చాలా కాస్ట్‌లీ గా ఉండాల‌ని ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ క్ర‌మంలో మెగా హీరో వ‌రుణ్ తేజ్ తాజాగా బెంజ్ కారు కొనుకున్నాడు. తన తండ్రి నాగబాబును.. తల్లి పద్మజను తీసుకెళ్ళి.. హైదరాబాదులోని బెంజ్ షోరూమ్ నుండి ఈ 1 కోటి 30 లక్షల రూపాయల కారును డెలివరీ తీసుకున్నాడు. ఇలాంటి కారుని టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో ఎన్టీఆర్, అల్లు అర్జున్‌, ర‌కుల్‌, తాప్సీ వాడుతున్న‌ట్టు తెలుస్తుంది. ఈ కారు మెర్సిడెస్ బెంజ్ GL350 అని తెలుస్తుండ‌గా, ఈ కారుకి వ‌రుణ్‌ ఎలాంటి ఫ్యాన్సీ నెంబ‌ర్ తీసుకుంటాడో అని అభిమానులు అనుకుంటున్నారు. వ‌రుణ్ తేజ్ న‌టించిన తొలి ప్రేమ చిత్రం ఫిబ్ర‌వ‌రి 9న ప్రేక్ష‌కుల ముందుకు రానుండ‌గా, ఇందులో రాశీ ఖ‌న్నా క‌థానాయిక‌గా న‌టించింది. ఇక త్వ‌ర‌లో రానా, వెంక‌టేష్ వంటి స్టార్స్‌తో క‌లిసి వ‌రుణ్ తేజ్ మ‌ల్టీ స్టార‌ర్ చేయ‌నున్న‌ట్టు స‌మాచారం.

Related Stories: