చొక్కా కుట్టి తండ్రికి బహుమతి ఇచ్చిన హీరో..వీడియో వైరల్

ముంబై: బాలీవుడ్ నటుడు వరుణ్‌ధవన్ ‘సూయిధాగా’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొస్తున్న విషయం తెలిసిందే. వరుణ్‌ధవన్ తండ్రి, డైరెక్టర్ డేవిడ్ ధవన్ పుట్టినరోజు నేడు. తన తండ్రి పుట్టినరోజును కొత్తగా జరిపాడు వరుణ్. తాను స్వయంగా కుట్టిన చొక్కాను తండ్రికి బహుమతిగా ఇచ్చి సర్‌ప్రైజ్ ఇచ్చాడు వరుణ్. నేను దర్జీలు కుట్టేంత మంచిగా దుస్తులు కుట్టలేను. కానీ సూయి ధాగా సినిమా కోసం టైలరింగ్ నేర్చుకున్నా. మా నాన్న నన్ను ఇప్పటికీ యువకుడు అని అనుకుంటారు. కానీ నేను ఆయన కోసం చొక్కా కుట్టిచ్చిన తర్వాత నేను ఎదిగాననే అభిప్రాయానికి వస్తారు అని అన్నాడు. మేడ్ ఇన్ ఇండియా ఇతివృత్తంతో సూయీదాగా చిత్రం తెరకెక్కుతున్నది. వరుణ్ ధవన్ స్వయంగా చొక్కాను కుట్టిన వీడియో..ఆ చొక్కాను వేసుకున్న డేవిడ్ ధవన్ ఫొటోలు వైరల్ గా మారాయి.

Related Stories: