విచిత్ర హావ‌భావాల‌తో మెహరీన్‌, త‌మ‌న్నా

వెంక‌టేష్‌, వ‌రుణ్ తేజ్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతున్న మ‌ల్టీ స్టార‌ర్ చిత్రం ఎఫ్‌2 (ఫ‌న్ అండ్ ఫ్ర‌స్ట్రేష‌న్‌) . అనీల్ రావిపూడి ద‌ర్శక‌త్వంలో రూపొందుతున్న‌ ఈ చిత్రం ఫుల్ హిలేరియ‌స్ కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఉంటుంద‌ని తెలుస్తుంది. ఎంతో ప్రస్టేజీయ‌స్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో వెంకీ స‌ర‌స‌న త‌మ‌న్నా క‌థానాయిక‌గా న‌టిస్తుండ‌గా, వ‌రుణ్ తేజ్ స‌ర‌స‌న మెహ‌రీన్ జోడి క‌ట్టింది. ఇటీవ‌ల‌ వెంక‌టేష్‌, వ‌రుణ్ తేజ్‌లు తోడ‌ళ్ళుగా మాస్‌లుక్‌లో లుంగీతో కనిపించి సంద‌డి చేశారు. తాజాగా మెహ‌రీన్ త‌న కో ఆర్టిస్ట్ త‌మ‌న్నాతో క‌లిసి సెల్ఫీలు దిగింది. విచిత్ర‌పు ఎక్స్‌ప్రెష‌న్స్‌తో వీరిద్ద‌రు ఫోటోల‌కి ఫోజులిచ్చారు. ఈ ఫోటోల‌పై అభిమానులు వెరైటీ కామెంట్స్ చేస్తున్నారు. శ్రీ వెంక‌టేశ్వ‌ర బేన‌ర్‌పై దిల్ రాజు నిర్మించ‌నున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్ర‌సాద్ సంగీతం అందిస్తున్నాడు. అతి త్వ‌ర‌లోనే చిత్ర టీజ‌ర్ ఒక‌టి విడుద‌ల చేసి మూవీపై భారీ అంచ‌నాలు పెంచాల‌ని మేక‌ర్స్ భావిస్తున్నారు.

Related Stories: