కూతురిపై కేసు పెట్టిన సీనియ‌ర్ న‌టుడు

త‌మిళ సీనియ‌ర్ న‌టుడు విజ‌య్ కుమార్ త‌న కూతురు వనిత‌పై స్థానిక మ‌ధుర‌వాయిల్ పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు చేయ‌డం కోలీవుడ్ నాట హాట్ టాపిక్‌గా మారింది. కొన్నాళ్ళుగా వ‌నిత‌, విజ‌య్ కుమార్ కుటుంబాల మ‌ధ్య గొడ‌వలు జ‌రుగుతుండ‌గా, బుధ‌వారం ఇది మ‌రోసారి బ‌హిర్గ‌తైమంది. వివ‌రాల‌లోకి వెళితే విజ‌య్ కుమార్ అల‌పాక్క‌మ్‌లోని అష్ట‌ల‌క్ష్మీ న‌గ‌ర్ 11వ వీధిలో ఉన్న త‌న ఇంటిని అప్పుడప్పుడు షూటింగ్‌ల‌కి ఇస్తున్న‌ట్టు తెలిపాడు. ఈ క్ర‌మంలో త‌న కూతురు షూటింగ్ కోసం ఇల్లు అద్దెకి అడ‌గ‌డంతో ఇచ్చాన‌ని విజ‌య్ కాంత్ అన్నారు. అయితే షూటింగ్ పూర్తైన త‌ర్వాత కూడా విజ‌య్ కాంత్ కూతురు వ‌నిత ఇల్లు ఖాళీ చేయ‌క‌పోగా న్యాయ‌వాద‌లు,రౌడీల‌తో బెదిరింపులకి దిగుతుంద‌ని స్ప‌ష్టం చేశారు. విజ‌య్ కాంత్ ఫిర్యాదుపై కేసు న‌మోదు చేసుకున్న మధురవాయిల్‌ పోలీస్ క‌మీషనర్‌ విచారణ చేస్తున్నారు. అయితే ఇంట్లో త‌న‌కు భాగం ఉన్నందునే తాను ఇల్లు ఖాళీ చేయ‌న‌ని పోలీసుల‌తో వాగ్వాదానికి దిగింది వ‌నిత‌. అంతేకాదు మీడియాతోను దురుసుగా ప్ర‌వ‌ర్తించి వారి కెమెరాల‌ని నేల‌కేసి కొట్టింది. తండ్రి, కూతుళ్ల మ‌ధ్య జ‌రుగుతున్న ఈ వివాదం ఎలా ముగుస్తుందో చూడాలి.

Related Stories: