ఎన్టీఆర్‌పై జోకు వేసిన వాజపేయి

వాజపేయి గొప్పవక్త. మాటకారి. చెణుకులు విసరడంలో దిట్ట. ఆయన వేసిన జోకులను కథలుకథలుగా చెప్పుకుంటారు. ఎన్టీఆర్ ఏపీ సీఎంగా ఉన్నరోజుల్లో కాంగ్రేసేతర పక్షాలను ఒకతాటి మీదకు తెచ్చేందుకు ప్రయత్నించేవారు. తరచుగా విపక్షాల సదస్సులు ఏర్పాటు చేసేవారు. అలాంటి ఒక సదస్సుకు పలువురు జాతీయ నేతలతోపాటుగా వాజపేయి హాజరయ్యారు. భోజనాల వేళ ఎన్టీఆర్ తనదైన శైలిలో వారందిరికీ బకెట్లో వెన్నతెచ్చి స్వయంగా వడ్డిస్తున్నారు. అప్పుడు వాజపేయి సరదాగా రామారావు సాబ్‌నే హమ్‌కో మస్కా లగారహా హై (రామారావుగారు మనకు మస్కా కొడుతున్నారు) అని చెణుకు విసిరితే అంతా నవ్వుల్లో మునిగిపోయారు.
× RELATED ఇంజిన్ రహిత రైలు ట్రైయిల్ రన్ విజయవంతం