ఈసీకి ముంబై నార్త్ అభ్యర్థి ఊర్మిళ ఫిర్యాదు

ముంబై: బాలీవుడ్ నటి ఊర్మిళా మటోండ్కర్ కాంగ్రెస్ తరపున ముంబై నార్త్ లోక్‌సభ స్థానం నుంచి పోటీలో ఉన్న విషయం తెలిసిందే. ఊర్మిళపై ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి గోపాల్‌శెట్టి 90 వేల ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇదిలా ఉంటే ఊర్మిళా ఈవీఎంలపై అనుమానం వ్యక్తం చేశారు. మెగథానే నియోజకవర్గంలోని ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రంలో సాంకేతిక సమస్య ఏర్పడిందన్నారు. ఈవీఎం 17సీ ఫారంపై సంతకాలు, మెషిన్ నంబర్లు వేర్వేరుగా ఉన్నాయని ఊర్మిళ ఆరోపించారు. ఈ మేరకు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.