ప్రమాదంలో గాయపడ్డ జింక..

చేగుంట: రోడ్డు ప్రమాదంలో గాయపడిన జింకకు చేగుంట పశువైద్యాధికారి శ్రీనివాస్ చికిత్స చేశారు. చేగుంట మండల పరిధిలోని పులిమామిడి కిష్టపూర్ గ్రామ శివారులోని రామాయంపేట, దౌల్తాబాద్ వెళ్లే రహదారిలో ఆదివారం రాత్రి నార్సింగి మండలకేంద్రానికి చెందిన కుంట కిష్టయ్య, పుష్ప దంపతులు దిచక్రవాహనంపై బోనాల్ నుంచి నార్సింగికి వస్తున్న సమయంలో జింకను ఢీ కొనడంతో దిచక్రవాహనంపై ఉన్న దంపతులతో పాటు జింకకు గా యాలైయ్యాయి. ఫారెస్టు అధికారుల సహకారంతో సోమవారం జింకను చేగుంట పశువైద్యశాలకు తరలించారు. వైద్యాధికారి శ్రీనివాస్ జింకకు చికిత్స చేశారు. ప్రస్తుతం జింక ఆరోగ్యంగా ఉందన్నారు.

Related Stories: