ఔటర్ వెంబడి సహజమైన అడవులు..

హైదరాబాద్ : నిత్యం పని ఒత్తిడిలో ఉండే ప్రజానీకానికి సేదతీరే సహజమైన అడవులు అందుబాటులోకి రానున్నాయి. హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దే చర్యల్లో భాగంగా హెచ్‌ఎండీఏ పరిధిలో మరింత ఉన్నత జీవన ప్రమాణాల పెంపునకు అధికారులు చర్యలకు శ్రీకారం చుట్టారు. పట్టణ ప్రాంతాల్లో నివాసం ఉంటూ ఆరోగ్యం, ఆహ్లాదం కోరుకునే వారీ కోసం హెచ్‌ఎండీఏ 24 ప్రాంతాల్లో ఆటవీ ఉద్యానవనాలు (అర్భన్ ఫారెస్ట్ బ్లాక్) ఏర్పాటు చేస్తోంది.

ఔటర్ రింగ్ రోడ్డు వెంబడి ఉన్న ఆటవీ భూముల్లో సహజమైన ఆడవి, ప్రకృతి దెబ్బ తినకుండా, కాంక్రీట్ వినియోగం లేకుండా అర్బన్ పార్కులను తీర్చిదిద్దనున్నారు. 6604 ఎకరాల్లో రూ. 93కోట్ల అంచనా వ్యయంతో తొలి విడతలో ఐదు ప్రాంతాలను గుర్తించారు. పల్లెగడ్డ (శంషాబాద్), మన్యంకంచె, సంగారెడ్డి, తుర్కపల్లి, ఖమ్మదనం ప్రాంతాలలో అర్బన్ ఫారెస్ట్ బ్లాక్‌ల పనులకు ఇటీవల శ్రీకారం చుట్టారు. అర్భన్‌ఫారెస్ట్రీ విభాగం అధికారుల పర్యవేక్షణలో లేబర్ ఇంటెన్సీవ్ మేథడ్ పద్దతిలో లక్షల మొక్కలను నాటుతున్నారు. ఇదే సమయంలో ఈ ఫారెస్ట్ బ్లాక్‌ల చుట్టూ ఫెన్సింగ్ (కంచె) నిర్మాణ పనులకు రూ. 26కోట్ల అంచనాతో ఇంజినీరింగ్ విభాగం అధికారులు టెం డర్లను ఆహ్వానించారు. సింగిల్ టెండర్ దాఖలు చేయడం తో తిరిగి రెండో విడతలో టెండర్లను ఆహ్వానించారు. త్వరలోనే ఈ ప్రక్రియను పూర్తి చేసి వచ్చే నెలాఖరు నాటికి మొక్కలను నాటుతామని అధికారులు తెలిపారు.

Related Stories: