ఫైజాబాద్ ఇకపై అయోధ్య ..ప్రతిపాదనను ఆమోదించిన యూపీ కేబినెట్

లక్నో: ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఫైజాబాద్ డివిజన్ పేరును అయోధ్యగా.. అలహాబాద్ డివిజన్‌ను ప్రయాగ్‌రాజ్‌గా పిలవాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. తాజాగా యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అధ్యక్షతన ఇవాళ కేబినెట్ సమావేశం జరిగింది. ఆ రెండు డివిజన్ల పేర్ల మార్పునకు కేబినెట్ ఆమోదం తెలిపినట్లు పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి సురేశ్ ఖన్నా విలేకరులకు తెలిపారు. ప్రయాగ్‌రాజ్ డివిజన్‌లో ప్రయాగ్‌రాజ్, కౌశంబి, ఫతేపూర్, ప్రతాప్‌గఢ్ జిల్లాలు ఉంటాయని, అయోధ్య డివిజన్‌లో అయోధ్య, అంబేద్కర్‌నగర్, సుల్తాన్‌పూర్, అమేథి,బారాబంకి జిల్లాలు ఉంటాయని పేర్కొన్నారు. పేర్లు మార్చకూడదంటూ ప్ర‌తిప‌క్షాల నుంచి నిరసనలు వ్యక్తమైనా యోగి ప్రభుత్వం మాత్రం వెనక్కి తగ్గలేదు. పేర్ల‌ మార్పును సమాజ్‌వాదీ, కాంగ్రెస్ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.

Related Stories: