ఉన్మాది కహాని

ఎన్.ఆర్. రెడ్డి ప్రధాన పాత్రలో నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఉన్మాది. ఎన్. రామారావు నిర్మిస్తున్నారు. సెన్సార్‌కు సిద్ధమైంది. దర్శకుడు మాట్లాడుతూ పల్లెటూరి నేపథ్యంలో సాగే చిత్రమిది. మంచి వ్యక్తి ఉన్మాదిగా మారిపోవడానికి దారితీసిన పరిస్థితులేమిటన్నదే ఈ చిత్ర ఇతివృత్తం. గుంటూరు జిల్లాలోని నకరికల్లు గ్రామంలో ముప్ఫై రోజుల పాటు జరిపిన సింగిల్ షెడ్యూల్‌లో చిత్రీకరణ పూర్తయింది. ఎనిమిది పోరాట ఘట్టాలు, ఐదు పాటలుంటాయి. కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించాం. త్వరలో పాటలు, సినిమా విడుదల తేదీని ప్రకటిస్తాం అని తెలిపారు. అల్లు రమేష్, శివ, శిరీష, రమ్య, ప్రమీల, పుష్పలత ముఖ్య పాత్రలను పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: డేవిడ్, కెమెరా: దంటు వెంకట్.