తెలంగాణ నూతన జోనల్ విధానానికి కేంద్రం ఆమోదం

న్యూఢిల్లీ : తెలంగాణ నూతన జోనల్ విధానానికి కేంద్రం ఆమోదం తెలిపింది. ఏడు జోన్లు, రెండు మల్టీ జోన్లకు అంగీకారం తెలుపుతూ కేంద్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. కొత్త జోనల్ వ్యవస్థతో స్థానికులకే 95 శాతం ఉద్యోగాలు దక్కనున్నాయి. కొత్తగా అమల్లోకి వచ్చే జోనల్ వ్యవస్థ ప్రకారం ఆయా శాఖల్లో జిల్లా, జోనల్, మల్టీ జోనల్ పోస్టులను వర్గీకరించి, సర్వీస్ నిబంధనలు మార్చుకొని సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శైలేంద్ర కుమార్ జోషి అన్నిశాఖల కార్యదర్శులకు ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసిన విషయం విదితమే. మరోవైపు కొత్తగా దాదాపు 50 వేల ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్లు సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. నీళ్లు- నిధులు-నియామకాలు అనే ట్యాగ్‌లైన్‌తో ఏర్పడిన తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర కలలను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నాయకత్వంలోని ప్రభుత్వం వాస్తవరూపంలోకి తెచ్చి చూపిస్తున్నది. ఇప్పటికే నిధుల సమస్యను పరిష్కరించగా, నీళ్ల కోసం అపరభగీరథ ప్రయత్నం చేస్తున్నారు. నియామకాల్లో భాగంగా స్థానిక యువతకే ఉద్యోగాలు కల్పించేదిశగా నూతన జోనల్ వ్యవస్థతో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారు.
× RELATED మద్దూరి వెంకటేశ్వర శివైక్యం పట్ల సీఎం కేసీఆర్ సంతాపం