పొలిటికల్ హ్యాకథాన్‌కు కొనసాగింపుగా ఉంగ్లీ చాలెంజ్

-టీటా గ్లోబల్ ప్రెసిడెంట్ సందీప్ మక్తాల హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ఇటీవలే రాజకీయ పక్షాలు, ప్రజాస్వామ్య వేదికలు, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లతో నిర్వహించిన పొలిటికల్ హ్యాకథాన్‌కు కొనసాగింపుగా ఉంగ్లీ చాలెంజ్ అనే వినూత్న కార్యాచరణను రూపొందించినట్టు తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ (టీటా) గ్లోబల్ ప్రెసిడెంట్ సందీప్ మక్తాల తెలిపారు. కికి చాలెంజ్ తరహాలోనే ఉంగ్లీ చాలెంజ్ సాగుతుందని అన్నారు. ఐటీ రంగంలోనివారికి ఓటింగ్‌పై అవగాహన కల్పించేందుకే ఉంగ్లీ చాలెంజ్‌ను సిద్ధం చేశామని చెప్పారు. సందీప్ బుధవారం స్వయంగా డ్యాన్స్‌చేసి టీటా సభ్యులకు చాలెంజ్ విసిరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నవంబర్ 30 వరకు ఈ చాలెంజ్ కొనసాగుతుందని అన్నారు. పదిరోజులపాటు సాగే ఉంగ్లీ చాలెంజ్ ద్వారా డ్యాన్స్, మెసేజ్‌లతో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లలో ఓటింగ్‌పై అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు.