కవల సోదరులను చంపిన మేనమామ

హైదరాబాద్: నగరంలోని చైతన్యపురి పరిధి సత్యనారాయణపురంలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. ఇద్దరు మానసిక వికలాంగులైన కవల సోదరులను మేనమామే హతమార్చాడు. చిన్నారులను చంపి కారులో తరలిస్తుండగా ఇంటి యజమాని గమనించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. స్థానికుల సహకారంతో నిందితుడిని పోలీసులకు అప్పగించారు. మృతిచెందిన బాలలు నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన సృజనరెడ్డి(12), విష్ణువర్దన్‌రెడ్డి(12).
× RELATED రేపు నగరంలో ట్రాఫిక్ అంక్షలు..