ఫిమేల్ పోలీసులకు స్పెషల్ స్క్రీనింగ్

సొట్టబుగ్గల సుందరి తాప్సీ, బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన చిత్రం నామ్ షబానా. బేబి మూవీకి ప్రీక్వెల్ గా తెరకెక్కిన ఈ యాక్షన్ స్పై థ్రిల్లర్ ఇటు తెలుగు అటు హిందీ భాషలలో మార్చి 31న విడుదల కానుంది. ఈ మూవీ కోసం తాప్సీ చాలా హార్డ్ వర్క్ చేసింది. బీభత్సమైన యాక్షన్‌ ఎపిసోడ్స్‌ కోసం హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్ సిరిల్ రఫెల్లీ పర్యవేక్షణలో శిక్షణ తీసుకుంది. శివం నాయర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని ఇప్పుడు ఫీమేల్ పోలీస్ ఆఫీసర్స్ కోసం మార్చి 27న స్పెషల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేయనున్నారు ఢిల్లీ పోలీసులు. కొన్నాట్ లోని మల్టీ ప్లెక్స్ లో ప్రదర్శించబడనున్న ప్రత్యేక షోకి అక్షయ్ కుమార్, ఢిల్లీ పోలీస్ కమీషనర్ అమూల్య పట్నాయక్ తదితరులు హాజరు కానున్నారట. బాలీవుడ్ సమాచారం ప్రకారం ఈ స్పెషల్ షోకి వందమంది ఉమెన్ పోలీస్ ఆఫీసర్స్, వివిధ ర్యాంకులతో పాటు పలు డివిజన్స్ కి చెందిన వారు కూడా ఈ షోని చూడనున్నారట. ఉమెన్ సెంట్రిక్ చిత్రంగా తెరకెక్కిన నామ్ షభానా చిత్రం అందరు మెచ్చే చిత్రంగా ఉందని, ఇది తప్పక అలరిస్తుందని దర్శక నిర్మాతలు చెబుతున్నారు.
× RELATED యోగా టీచర్ కావాలనుకునే వారికి సువర్ణావకాశం..