20 దెయ్యాలతో శృంగారంలో పాల్గొన్న 27 ఏండ్ల మహిళ

దెయ్యంతో శృంగారం ఏంది.. దాన్ని చూస్తేనే దడుసుకుంటాం. ఆమడ దూరం పరిగెడతాం. ప్రకృతికి విరుద్ధంగా ఏంటీ పనులు.. అసలు దెయ్యాలే కనిపించవు.. ఇక.. వాటితో శృంగారమా. ఇదంతా అబద్ధం.. పచ్చి అబద్ధం. అని అంటారా? అయితే.. ముందు ఈ స్టోరీ చదవండి.. తర్వాత అసలు ఈ స్టోరీలోని నిజానిజాలు తెలుసుకుందాం. అది యూకే. 27 ఏండ్ల అమెథిస్ట్ రియల్మ్ స్పిరిచువల్ గైడెన్స్ కౌన్సిలర్‌గా వర్క్ చేస్తున్నది. ఆమె కు కొన్నేండ్ల కింద పెళ్లి అయింది. సరే ఓ 10 ఏండ్ల కింద అనుకోండి. ఆ సమయంలోనే వాళ్లు ఓ కొత్త ఇల్లును కొనుక్కున్నారు. పెళ్లయిన కొత్తలో ఆ ఇంట్లో ఉండటానికి వెళ్లారు. అయితే.. ఆమె భర్త ఎక్కువగా ఇంట్లో ఉండడు. ట్రావెలింగ్ అంటూ ఎప్పుడూ అటూ ఇటూ తిరుగుతుంటాడు. దీంతో తను ఒంటరిగా ఆ ఇంట్లో ఉండాల్సొచ్చేది. ఆ సమయంలోనే తనకు ఓ దెయ్యంతో పరిచయం ఏర్పడింది. అవును.. ఆ ఇంట్లో ఓ దెయ్యం ఉండేదట. అందుకే రాత్రి వేళల్లో దానితో పరిచయం ఏర్పడిందట. దీంతో ఆ దెయ్యంతో శృంగారంలో పాల్గొనాలనే కోరిక అమెథిస్ట్‌కు కలిగిందట. దీంతో రాత్రి వేళల్లో లోదుస్తులు వేసుకొని ఇంట్లో తిరుగుతూ దెయ్యాన్ని టెంప్ట్ చేసేదట. అలా.. అమెథిస్ట్, దెయ్యం ఒక్కటయ్యారట. అలా ఓ మూడు సంవత్సరాలు వాళ్లిద్దరి మధ్య ఈ వ్యవహారం నడిచిందట. చివరకు ఈ విషయం అమెథిస్ట్ భర్తకు తెలిసిందట. దీంతో తనను నిలదీశాడట. వెంటనే ఆ దెయ్యమే అమెథిస్ట్‌తో తనకు ఉన్న సంబంధాన్ని ఆమె భర్తకు వివరించిందట. అయితే.. అమెథిస్ట్ భర్త ఆమెను నిలదీసినప్పటి నుంచి ఆ దెయ్యం మళ్లీ అమెథిస్ట్ దగ్గరకు రాలేదట. దీంతో మరో దెయ్యంతో రిలేషన్‌షిప్ స్టార్ట్ చేసిందట. ఇలా.. మొత్తం 20 దెయ్యాలతో శృంగారంలో పాల్గొన్నదట. అంతే కాదు.. తను ఆ దెయ్యాలతో ఓ బిడ్డను కూడా కనాలనుకుంటున్నదట. వాటితో ఓ ఫ్యామిలీని అమెథిస్ట్ మెయిన్‌టేన్ చేయాలనుకుంటున్నదట. అందుకోసమే.. దెయ్యంతో బిడ్డను ఎలా కనాలో అనే దానిపై రీసెర్చ్ కూడా చేస్తున్నదట. అంతే కాదు.. మనుషులతో కంటే దెయ్యాలతోనే శృంగారం చేయడం తనకు ఇష్టమట. ఇదే స్టోరీ. ఈ విషయాలన్నింటినీ.. అమెథిస్టే స్వయంగా ఓ టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పింది. షోను హోస్ట్ చేస్తున్న నిర్వాహకులే తను చెబుతున్న విషయాలను విని షాక్‌కు గురయ్యారట. అసలు.. ఈమె చెప్పేది నిజమా అబద్ధమా తెలియక జుట్టు పట్టుకున్నారట. అయితే.. షో హోస్ట్ కొంచెం తెలివితో.. అమెథిస్ట్ నిజం చెబుతుందా.. అబద్ధం చెబుతుందా అని తెలుసుకోవడానికి ఓ ప్రశ్న వేశాడట. ఏంటంటే.. అసలు.. దెయ్యాలే కనిపించవు కదా.. మరి నీకు 20 దెయ్యాలతో సంబంధం ఉందని నీకు ఎలా తెలుసు. అది ఒకే దెయ్యం అవ్వొచ్చు కదా. అని అడిగాడట. దీంతో అమెథిస్ట్ ఏం చెప్పిందో తెలుసా. ఒకే దెయ్యం అయితే.. ఆ అనుభవం ఒకేరీతిలో ఉంటుంది. కాని.. ప్రతి సారి నాకు కొత్త కొత్త అనుభవాలు ఎదురయ్యేవి.. శృంగారంలో పాల్గొనడం ఒకటే అయినా.. వేర్వేరు దెయ్యాలా ఎనర్జీ లేవల్స్ ఖచ్చితంగా వేర్వేరుగా ఉంటాయి. అలా వేర్వేరు దెయ్యాలతో శృంగారంలో పాల్గొంటున్నట్లు తెలిసేది... చెప్పింది అమెథిస్ట్. సరే.. అసలు నువ్వు దెయ్యంతో శృంగారంలో పాల్గొంటున్నావని ఎలా తెలిసేది అని షో నిర్వాహకులు మరో ప్రశ్న వేశారట. అప్పుడు అమెథిస్ట్ ఏం చెప్పిందంటే.. ఆ సమయంలో నామీద ఏదో బరువు పడుతున్నట్లు అనిపించేది... నా మీద పెద్ద బరువు ఉండేది. సాధారణంగా మనుషులతో శృంగారం చేస్తే ఎటువంటి ఫీలింగ్స్ వస్తయో... నాకు దెయ్యంతో శృంగారంలో పాల్గొన్నా... అలాంటి ఫీలింగ్సే కలిగేవి అని చెప్పిందట. అమెథిస్ట్. అది సంగతి.. ఇక.. షో హోస్టులు కూడా చేసేదేమి లేక.. నిజమే... ఈమె దెయ్యాలతో శృంగారంలో పాల్గొన్నట్టే అని ఫిక్స్ అయిపోయారట. ఇప్పుడు మీరు చెప్పండి.. అమెథిస్ట్ నిజం చెబుతున్నదా.. లేక అబద్ధమా?
× RELATED కాంగ్రెస్ పార్టీ తొలి జాబితా విడుదల