సెప్టెంబర్ 29ని సర్జికల్ స్ట్రైక్‌ డేగా సెలబ్రేట్ చేసుకోండి!

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా అన్ని యూనివర్సిటీలు, ఉన్నత విద్యాసంస్థలు సెప్టెంబర్ 29ని సర్జికల్ ైస్ట్రెక్ డేగా జరుపుకోవాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఆదేశాలు జారీ చేసింది. ఓవైపు మోదీ సర్కార్ సర్జికల్ ైస్ట్రెక్స్ రెండో వార్షికోత్సవం జరుపనున్న సందర్భంగా యూజీసీ ఈ ఆదేశాలు జారీ చేయడం విశేషం. ఈ సంబురాల్లో భాగంగా మాజీ సైనికాధికారులను పిలిచి విద్యార్థులకు సందేశం ఇవ్వడం, ప్రత్యేక పరేడ్లు, భద్రతా బలగాలకు గ్రీటింగ్ కార్డ్స్ పంపడంలాంటివి చేయాలని యూజీసీ యూనివర్సిటీలకు సూచించింది. అన్ని వర్సిటీల చాన్స్‌లర్లకు గురువారం ఈ మేరకు ఆదేశాలు జారీ అయ్యాయి. సెప్టెంబర్ 29న ఇండియా గేట్ దగ్గర ప్రత్యేకంగా ఓ మల్టీ మీడియా ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తున్నాం. ఇలాంటివే రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, ముఖ్య పట్టణాలు, కంటోన్మెంట్స్‌లలో నిర్వహించాలి. విద్యార్థులు ఈ ఎగ్జిబిషన్లకు వెళ్లేలా వర్సిటీలు ప్రోత్సహించాలి అని ఆ లేఖలో యూజీసీ సూచించింది. 2016, సెప్టెంబర్ 29న తొలిసారి భారత భద్రతా బలగాలు సరిహద్దు దాటి ఎల్వోసీ వెంబడి ఉన్న పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే.

Related Stories: