ఉద్దవ్ థాక్రేకు థ్యాంక్యూ కాల్ చేసిన ప్రధాని మోదీ

ముంబయి: శివసేన అధ్యక్షుడు ఉద్దవ్‌థాక్రేకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ ఉదయం థ్యాంక్యూ కాల్ చేశారు. రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ఎన్నికలో ఎన్డీయే అభ్యర్థి హరివంశ్‌కు మద్దతు ఇచ్చినందుకుగాను కృతజ్ఞతలు తెలుపుతూ ప్రధాని ఈ ఫోన్‌కాల్ చేశారు. ఇటీవలీ కాలంలో శివసేన మోదీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. తన అధికారిక పత్రిక సామ్నా వేదికగా మోదీ ప్రభుత్వ ఆర్థిక, విదేశీ విధానాన్ని తూర్పారబట్టింది. ఈ నేపథయలో బీజేపీ, శివసేన సత్‌సంబంధాల నిమిత్తం బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా రంగంలోకి దిగి గడిచిన జూన్ నెలలో థాక్రే ఇంటికి స్వయంగా వెళ్లి కలిశారు. ఎన్డీయే అభ్యర్థిగా హరివంశ్‌ను ప్రతిపాదించిన అనంతరం మద్దతు తెలపాల్సిందిగా కోరుతూ ఈ నెల 7న అమిత్ షా.. ఉద్దవ్‌థాక్రేను కోరారు. నిన్న జరిగిన రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ఎన్నికలో ఎన్డీయే అభ్యర్థి హరివంశ్ నారాయణ్ సింగ్ విజయం సాధించిన తెలిసిందే.

Related Stories: