ఎగిరే ట్యాక్సీలపై ప్రధాని మోదీతో యూబర్ చర్చలు

భారత్‌లో ఎగిరే ట్యాక్సీలను ప్రవేశపెట్టడంపై యూబర్ ప్రతినిధులు ప్రధాని నరేంద్రమోదీతో భేటీ అయ్యారు. యూబర్ కంపెనీ ఓ ప్రకటనలో ఈ సంగతి వెల్లడించింది. ఎగిరే ట్యాక్సీలు, కార్ పూలింగ్, స్వయంచాలక వాహనాల వంటి అంశాలు ఈ భేటీలో చర్చకు వచ్చాయి. భారత్‌ను ముందుకు తీసుకువెళ్లే కృషిలో ప్రబుత్వాన్ని భాగసామిని చేయాలనుకుంటున్నట్టు యూబర్ పేర్కొన్నది. యూబర్ గగన విహార కార్యక్రమాల విభాగం అధిపతి ఎరిక్ ఆలీసన్, ఉత్పాదన విభాగం అధిపతి నిఖిల్ గోయల్ గ్లోబల్ మొబిలిటీ సదస్సు సందర్భంగా ప్రధాని మోదీతో విడిగా సమావేశమయ్యారు. ఐదు అంతర్జాతీయ లాంచ్‌లలో భాగంగా ఇండియా పేరును యూబర్ పరిశీలిస్తున్నదని ఆలీసన్ వెల్లడించారు. ఎగిరే ట్యాక్సీల కోసం అమెరికాలో డల్లాస్, లాస్ ఏంజెలిస్ నగరాలను ఎంపిక చేసినట్టు యూబర్ ఇదివరకే ప్రకటించింది. ఇప్పుడు ఇండియాలో ముంబై, ఢిల్లీ, బెంగళూరు వంటి భారీ నగరాలపై దృష్టి సారించింది. ఈ నగరాల్లో 2020 నాటికి ప్రదర్శన సేవలు, 2023 నాటికి వాణిజ్య సేవలు ప్రారంభించాలని యూబర్ భావిస్తున్నది. రద్దీ సమస్యకు, కాలష్యానికి ఈ సేవలతో చెక్ పెట్టొచ్చని యూబర్ అంటున్నది.

× RELATED శృంగారానికి ఒప్పుకోలేదని ట్రాన్స్‌జెండర్‌పై కాల్పులు