జేబీ బీభత్సం.. విమానాశ్రయం మూసివేత

కన్‌సాయి: జపాన్‌లో టైఫూన్ జేబీ బీభత్సం సృష్టిస్తోంది. అత్యంత బలంగా వీస్తున్న గాలులకు.. అన్నీ కొట్టుకుపోతున్నాయి. భారీ వర్షాలు కూడా కురుస్తున్నాయి. కన్‌సాయి ఎయిర్‌పోర్ట్‌ను మూసివేశారు. ఒసాకా, కోబ్, క్యోటో ప్రాంత వాసులకు ఇదే ప్రధాన విమానాశ్రయం. ఈ రాష్ర్టాల్లోని వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సముద్రంలో కట్టిన కన్‌సాయి ఎయిర్‌పోర్ట్.. జేబీ టైఫూన్ ధాటికి దెబ్బతిన్నది. ఎయిర్‌పోర్ట్ బ్రిడ్జ్‌పై ట్యాంక్ సుడులు తిరిగింది. దీంతో ఆ బ్రిడ్జ్ ధ్వంసమైంది. గత 25 ఏళ్లలో ఇంత శక్తివంతమైన టైఫూన్ రావడం ఇదే మొదటిసారి. ఈ టైఫూన్ వల్ల సుమారు 10 మంది మృతిచెందారు. భయానకమైన గాలులకు రూఫ్‌టాప్‌లు లేచిపోతున్నాయి. కొన్ని చోట్ల వాహనాలు కూడా ఎగిరిపోతున్నాయి. అనేక చోట్ల విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. కన్‌సాయి ఎయిర్‌పోర్ట్‌ను మానవ నిర్మిత దీవిపై నిర్మించారు. ఈ విమానాశ్రయంలో సుమారు మూడు వేల మంది ప్రయాణికులు చిక్కుకున్నారు.
× RELATED స్వల్పంగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు