వియత్నాంలో మరో తుఫాన్: 15 మంది మృతి

హనాయ్: గత నెలలో వియత్నాంలో సంభవించిన తుఫాను నుంచి కోలుకోకముందే శనివారం మరో తుఫాను విరుచుకుపడింది. దీంతో 15 మంది మృతిచెందగా, నలుగురు గల్లంతయ్యారు. ఈ తుఫాను ప్రభావంతో ఖాన్ హూవా రాష్ట్రం బాగా దెబ్బతిన్నది. ఈ రాష్ట్రంలో 14 మంది చనిపోయారు. 302 ఇండ్లు నేలమట్టమయ్యాయి. పంట పొలాలు బాగా దెబ్బతిన్నాయి. బిన్‌దిన్, ఫూ యెన్ రాష్ర్టాలు సైతం తుఫాను ప్రభావానికి గురయ్యాయి. ఈ రాష్ర్టాల్లో ఒకరు మృతిచెందగా, నలుగురు గల్లంత య్యారు. తుఫాను నేపథ్యంలో అధికారులు దాదాపు 35 వేల మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పాఠశాల విద్యార్థులు ఇంటి నుంచి బయటికి రావద్దని సూచించారు. గత నెలలో తుఫాను వల్ల దాదాపు 75 మంది చనిపోగా, 28 మంది గల్లంతయ్యారు.

Related Stories: