భద్రతా బలగాల కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతం

శ్రీనగర్ : జమ్మూకశ్మీర్‌లోని బందిపొరా జిల్లాలో ఇవాళ ఉదయం భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు సంభవించాయి. ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులను బలగాలు మట్టుబెట్టాయి. ఇంకా ఎదురుకాల్పులు కొనసాగుతూనే ఉన్నాయి. ముగ్గురు ఎస్పీవోలు, ఒక పోలీసు అపహరణ షోపియాన్ జిల్లాలో ముగ్గురు ఎస్పీవోలు, ఒక పోలీసును ఉగ్రవాదులు అపహరించారు. ఎస్పీవోలు, పోలీసు ఆచూకీ కోసం పోలీసు ఉన్నతాధికారులు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.

Related Stories: